సినీ, టీవీ నటుడు ఎ. గోపాలరావు మృతి

ప్రముఖ సినీ టీవీ నటులు అల్లం గోపాలరావు ఈరోజు ఉదయం 8 గంటలకు అనారోగ్య కారణంగా తన నివాసంలో మృతి చెందారు ఆయన వయసు 75 సంవత్సరాలు ఆయనకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్దబాయ్ అనిల్ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. గోపాలరావు గారి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.

Related Articles

Latest Articles