‘యముడు’ నుంచి ‘ధర్మో రక్షతి’ పాట విడుదల

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు. భవానీ రాకేష్ అందించిన బాణీ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. యముడి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని చాటి చెప్పేలా సాగిన ఈ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌ కానుంది.

అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసిన ‘యముడు’ చిత్రయూనిట్ త్వరలోనే ఓ మంచి రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇకపై ‘యముడు’ నుంచి కంటిన్యూగా అప్డేట్లు ఉంటాయని మేకర్లు తెలిపారు..

నటీనటులు : జగదీష్ ఆమంచి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : జగన్నాధ పిక్చర్స్
కథ, దర్శకుడు, నిర్మాత : జగదీష్ ఆమంచి
రైటర్ : హరి అల్లసాని, జగదీష్ ఆమంచి
స్క్రీన్ ప్లే : శివ కుండ్రపు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రజిని ఆమంచి
ఎడిటర్ : కెసిబి హరి
డిఓపి : విష్ణు రెడ్డి వంగా
సంగీతం : భవాని రాకేష్
పీఆర్వో : సాయి సతీష్

Related Articles

Latest Articles