లైవ్ లో ఆడిషన్ – తెలుగు యాంకర్ కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ ఆంటోని

త్వరలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా రాబోతున్న మార్గన్ చత్ర ప్రమోషన్స్లో భాగంగా ఒక తెలుగు ఇంటర్వ్యూలో యాంకర్ ను నేరుగా ఆడిషన్ చేసి తన తర్వాత చిత్రంలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. లియో జాన్ పాల్ దర్శకత్వంలో రానున్న మార్గన్ చిత్రంలో బ్రిగిడ, దీప్శిక, సముద్రఖని, అజయ్ దిషన్ తదితరులు కీలకపాత్రల పోషిస్తున్నారు. అయితే ఇంటర్వ్యూ జరుగుతుండగా తెలుగు యాంకర్ అంజలిని ఎమోషనల్ గా నటిస్తూ ఆడిషన్ ఇవ్వమని అడగడంతో ఆమె తన నటనతో విజయ్ ఆంటోనీని ఇంప్రెస్ చేయడం జరిగింది. అంజలి నటిస్తుండగా ఆ పక్కనే ఉన్న దీప్శిక అంజలి నటనను చూసి షాక్ అయ్యారు. అంతేకాక అదే సెట్ లో ఉన్న బ్రిగిడ, అజయ్ దిషన్ ఆమె నటన చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారు. వెంటనే తన తర్వాతి చిత్రంలో ఓ కీలక పాత్రను అంజలి చేయనుందని ఆమెకు లైవ్ లో విజయ్ ఆంటోని మాటిచ్చారు. అటువంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదని చిత్ర బంధం అంతా అంజలి నటనను కొనియాడారు.

Related Articles

Latest Articles