దేశభక్తిని చాటుకున్న తెలుగు యాంకర్ స్రవంతి

భారతదేశ పాకిస్తాన్ శత్రు సైన్యంపై, ఉగ్రవాద మూకలపై చేసిన ఆపరేషన్ సింధూర్ అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో తెలుగు వీరా జవాన్ మురళి నాయక్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. ఒక్కడే కొడుకు అయినప్పటికీ పేదవాడిన మురళి నాయక్ దేశం కోసం ప్రాణం అర్పించడంతో తమ తల్లిదండ్రులు ఎంతో బాధకి లోనైనప్పటికీ తన కొడుకు దేశం కోసం మరణించడం తమకు గర్వకారణంగా ఉందని గతంలోనే తెలిపారు. అయితే సోలో బాయ్ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన వీరికి చిత్ర బంధం నుండి కొంత ఆర్థికపరమైన సపోర్ట్ రావడం జరిగింది. ఇదే సందర్భంగా ఆర్పి పట్నాయక్ త్వరలోనే ఒక మ్యూజికల్ నైట్ చేసి దానికి వచ్చిన ఆదాయాన్ని మీ కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు.

అయితే ఇదే ఈవెంట్ కు యాంకర్ గా చేస్తున్న చొక్కారపు స్రవంతి ఈ సందర్భంగా ఆ కుటుంబానికి లక్ష రూపాయలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక వారికోసం నిర్వహింపబడే మ్యూజికల్ నైట్ ఈవెంట్ కు తాను ఫ్రీగా యాంకరింగ్ చేస్తానని తెలిపారు. ఆ కుటుంబానికి అండగా నిలబడటం ఒక భారతీయురాలుగా తన బాధ్యతని తెలిపారు. అయితే గతంలో కూడా రాష్ట్రంలో వరదలు వచ్చిన సమయంలో ఆమె ప్రభుత్వానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలా గతంలో ఆమె ఎన్నో సందర్భాలలో ఇటువంటి సేవా కార్యక్రమాలలో తనదైన శైలిలో పాలు పంచుకున్నారు.

Related Articles

Latest Articles