‘కన్నప్ప’ ఓపెనింగ్ డేకి వంద కోట్ల మార్క్?

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న రాబోతోంది. ఇక ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. చాలా చోట్ల బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. సోమవారం నుంచి ఉత్తర అమెరికాలో, జూన్ 25 నుంచి భారతదేశం అంతటా టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప భారీ ఎత్తున విడుదల కానుంది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. అందరూ ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రం ఓపెనింగ్ డే రికార్డుల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియాలో ఈ మూవీని 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతోన్నారు. ప్రతి ప్రీమియం-ఫార్మాట్ ఆడిటోరియం (IMAX, స్క్రీన్ X మరియు 4DXతో సహా)లో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ఓవర్సీస్‌లో 1,100పైగా స్క్రీన్లు, 200లకు పైగా యూస్ ప్రీమియర్లను ప్లాన్ చేశారు.

భారీ ఎత్తున రిలీజ్ కాబోతోన్న కన్నప్ప చిత్రం ఓపెనింగ్ డేకి రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. వంద కోట్లతో డే వన్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉందని తెలుస్తోంది. కన్నప్పలో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి మహామహులు నటించారు. ఈ చిత్రంలో ఆస్కార్ విజేత వేటా విజువల్స్, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ హైలెట్స్ కానున్నాయి. అభిమానులు బుక్ మై షో, పేటీఎం మూవీస్, ఫాండంగో, ఆటమ్ టికెట్స్ వంటి వాటిల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Related Articles

Latest Articles