
సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న 40వ చిత్రం ‘3 BHK’ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. శ్రీ గణేష్ దర్శకత్వంలో, అరుణ్ విశ్వ నిర్మాణంలో శాంతి టాకీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవయాని, యోగి బాబు, మీథా రఘునాథ్, చైత్ర ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ట్రైలర్ మధ్యతరగతి కుటుంబం ఇల్లు కొనాలనే జీవితాశయాన్ని హృదయస్పర్శిగా చూపిస్తుంది. జీవితంలో వైఫల్యాలను ఎదుర్కొన్న తండ్రి, తన కుటుంబ ఆశలన్నీ కొడుకుపై పెడతాడు. అయితే, 34 ఏళ్ల వయసులోనూ ఉద్యోగం లేక, చదువులో వెనుకబడిన కొడుకు ఈ కథలో భావోద్వేగ కేంద్రంగా నిలుస్తాడు. కుటుంబం ఆశలు నెరవేరుతాయా అనేది కథ యొక్క ఆత్మ.
మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. దర్శకుడు శ్రీ గణేష్ భావోద్వేగ కథనంతో హృదయాన్ని హత్తుకునే కథను అందించారు. సిద్ధార్థ్ తన నటనతో పాత్రలో జీవించి, ప్రేక్షకుల్లో సానుభూతిని రేకెత్తిస్తాడు. శరత్ కుమార్ మధ్యతరగతి తండ్రిగా కుటుంబ ఆనందం, భద్రత కోసం కలలు కనే పాత్రలో అద్భుతంగా నటించారు. దేవయాని, మీథా, చైత్రలు తమ నటనతో కథకు బలం చేకూర్చారు.
తారాగణం: సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు, మీథా రఘునాథ్, చైత్ర
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: శ్రీ గణేష్
నిర్మాత: అరుణ్ విశ్వ
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్ బి, జితిన్ స్టానిస్లాస్
సంగీతం: అమృత్ రామ్‌నాథ్
ఎడిటర్: గణేష్ శివ
సంభాషణలు: రాకేందు మౌళి కళా
దర్శకత్వం: వినోద్ రాజ్‌కుమార్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆర్. శిబి మారప్పన్
పీఆర్ఓ: వంశీ-శేఖర్