తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా ఇప్పటికే డీలిమిటేషన్, హిందీ భాషపై వ్యతిరేకంగా తమిళనాడు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జాతీయ విద్యావిధానంపై దుమ్మెత్తిపోసింది.

దీంతో దేశవ్యాప్తంగా తమిళనాడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిలిం యాక్టీవ్ నిర్మాతల కౌన్సిల్, FCFSI కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఇకపై కోలివుడ్(తమిళ) సినిమా షూటింగ్ లకు FEFSI సభ్యులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించారు. మే 1 నుంచి ఈ విధానం అములు కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 2023లో కొంత చర్చ జరిగింది.

ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI).. ఇది తమిళ చిత్ర పరిశ్ర మలోని 23 యూనియన్ల నుండి టెక్నీషియన్లను కలిగి ఉన్న సంస్థ. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.. ఇతర పరిశ్రమల నుండి నటులు, స్టార్లతో తమిళ సినిమాలు తీయడం వల్ల FEFSI సభ్యులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని వారు భావించారు. అలాగే.. తమిళ సినిమాలు విదేశీ లొకేషన్లలో షూట్ చేయడం కూడా స్థానిక టెక్నీషియన్లకు అవకాశాలను తగ్గిస్తోందని భావించారు.

Related Articles

Latest Articles