
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా ద్వారా కొర్రకారుల మనసులో స్థాన సంపాదించిన నటి రమ్య పసుపులేటి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి విశ్వంభర సినిమాలో నటించే అవకాశం కూడా ఆమెకు దక్కింది. ఇది ఇలా ఉండగా జులై 4వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న సోలో బాయ్ చిత్రంలో ఆమె హీరోయిన్గా ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. విడుదలకు దగ్గరవుతున్న ఈ సమయంలో సోలో బాయ్ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయగా ఆ ఈవెంట్లో హీరోయిన్ రమ్య పసుపులేటి తన భర్తకు కావలసిన కొన్ని క్వాలిఫికేషన్ గురించి యాంకర్ ప్రశ్నించగా ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. నాకు కాబోయే భర్త ఎత్తుగా 6’2″ లేదా 6’3″ ఉండాలని, నన్ను మంచిగా చూసుకోవాలని అన్నారు. మంచిగా చూసుకునే వాళ్ళు దొరికితే అదే అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే చిత్ర ట్రైలర్ లో శాలరీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ కాబోయే భర్త శాలరీ ఎంత ఉండాలని ప్రశ్నించగా శాలరీతో నాకు పట్టింపులేదని, నేను సంపాదిస్తాను అని ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో ఆమె సమాధానాలు ఎంతో వైరల్ గా మారాయి. కాగా ఆమె నటించిన సోలో బాయ్ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది.