3 రోజులపాటు పైరసీ కనిపించకుండా చేశాం : దిల్ రాజు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై జూలై 4వ తేదీన నితిన్ హీరోగా లయా కీలకపాత్రలో వర్ష బొల్లమ్మ, సప్తమి కూడా తదితరులు హీరోయిన్లుగా నటిస్తూ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తమ్ముడు. ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు పైరసీ మాట్లాడడం జరిగింది. పైరసీని అరికట్టే విధంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని నిర్మాత దిల్ రాజును మీడియా వారి ప్రశ్నించగా పైరసీని అరికట్టే విధంగా ఇప్పటికే పని చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా ఈ విషయంలో కలిసి పనిచేస్తున్నాము. కుబేర, కన్నప్ప చిత్రాలకు కూడా మొదటి మూడు రోజులపాటు పైరసీ అనేది ఎక్కడ కనిపించకుండా ఎంతో కష్టపడి ఆపాము. ఇప్పుడు అదే దిశగా మేము కూడా పనిచేస్తున్నాము. ఇదే పద్ధతిలో ప్రతివారం జాగ్రత్తలు తీసుకుని పైరసీని అరికట్టే దిశగా పనిచేస్తాము.

ఇటీవల కాలంలో సింగిల్ చిత్రాన్ని ఇక్కడే హైదరాబాదులో నలుగురు వ్యక్తులు కలిసి పైరసీ చేసే ప్రయత్నంలో ఉండగా వారిని పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది. వారి వల్ల చిత్ర పరిశ్రమకు కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ప్రతి మార్గంలోనూ పైరసీని అరికట్టే విధంగా పనిచేస్తున్నాము అన్నారు.

అయితే ఇప్పటికే ఎఫ్డిసి చైర్మన్ గా నిర్మాత దిల్ రాజు గారు చిత్ర పరిశ్రమ కోసం ఎన్నో విధాలుగా సహాయపడే విధంగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Related Articles

Latest Articles