
నిర్మాత ఎస్ కే ఎన్ తన పుట్టినరోజు సందర్భంగా మీడియావారితో సంభాషించడం జరిగింది. తన ఇన్ని సంవత్సరాల సినీ జర్నీ పై మీడియా వారు అడిగిన ప్రశ్నలకు తన తదుపరి ప్రయాణాల గురించి అలాగే ఇండస్ట్రీలో తాను చూసిన పరిస్థితులను, ఆయనకున్న ఇండస్ట్రీలోని సత్సంబంధాల గురించి సమాధానం ఈ విధంగా ఇచ్చారు.
- స్టేజ్ ఎక్కే ముందు నేను షేక్ అవుతాను. నేను చాలా భయపడే వ్యక్తిని.
- కాలేజీలో ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ లో ఎస్సే రైటింగ్ లో నిలిచ.
- మెగా ఫ్యామిలీతో ఉండాలి అనుకుని ఇండస్ట్రీకి వచ్చా. శిరీష్ ద్వారా వచ్చాను.
- నా జీవితంలో మలుపు మారుతి. నన్ను నిర్మాతగా చేసింది మారుతి.
- బాలీవుడ్ లో సినిమా వచ్చే నెల నుండి ఫుల్ టైం షూట్ ఉంటుంది.
- హిందీ రీమేక్ లో ఇంటెన్స్ ఎక్కువగా ఉంటుంది.
- నేను జీవితంలో ప్రతి స్టేజ్ ఎంజాయ్ చేశాను.
- అల్లు అరవింద్ కాంపౌండ్ నన్ను నమ్మడం చాలా సంతోషం. నాకు వేరే ప్రొడక్షన్స్ బ్యానర్ లతో పని చేసే స్వచ్ఛ ఇచ్చారు.
- బన్నీ వాస్ కు ఎడిటింగ్, స్క్రిప్టింగ్ పై మంచి పట్టు ఉంది. మేము 12 ఏళ్లు ఒకటే రూమ్ లో ఉండేవాళ్ళం. చాలా స్టేబుల్ గా ఉంటారు.
- ఇప్పటికే 7-8 కొత్త తెలుగు ఆడవాళ్ళని పరిచయం చేశాం. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ & హీరోయిన్స్ చేస్తాం.
- చెన్నై లవ్ స్టోరీ కొంచం టైమ్ పడుతుంది.
- హిందీ బేబీ, చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో 2 సినిమాలు ఉన్నాయి. అలాగే మారుతి రాజాసాబ్ తర్వాత ఒకటి, సాయి రాజేష్ సినిమా ఒకటి. ఆహాలో 3 రోజెస్.
- నాకు కథ నచ్చితే పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఒకటే.
- ప్రస్తుతం ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీయాలి.
- అల్లు శిరీష్ తో ఒక సినిమా ఉండబోతుంది.
- కొత్త నిర్మాతలకు సూచనలు ఇస్తాను కానీ సలహాలు ఇచ్చే ఉద్దేశం లేదు.
- దేనికైనా సిద్ధం అయితేనే నిర్మాతగా రావాలి. కష్టం వచ్చినా, లాభం వచ్చినా నిలబడేలా రావాలి.
- రాజాసాబ్ టీజర్ తో ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోయాయి. వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నారు.
- సినిమానే నా ప్రపంచం. అందుకే సినిమా ఉన్న ప్రతిచోట ఉంటా.
- మనం ఒకరికి చెప్తే వినే పరిస్థితి లేదు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితిలో డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ పై.
- ఇప్పటికీ అయినా సినిమాలు తీసే పద్ధతులు కొన్ని మారాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా గ్లోబల్ అయిపోయింది.
- ముందుగా థియేటర్ లో సినిమా నడవటం జరగాలి.
- ఓటిటిలో సినిమా త్వరగా వచ్చేయడం అనేది ప్రేక్షకులకు అలవాటు అయిపోయింది. దాని వల్ల థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు.
- టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నప్పుడు పైరసీ తగ్గుతుంది. ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు.
- హీరో మార్కెట్ బట్టి కొన్ని సినిమాలు కొంత వరకు టికెట్ రేట్లు పెంచవచ్చు. కాని మిగతా సినిమాలకు ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి.
- సినిమాలలో రోల్ చేసే ఇంట్రెస్ట్, దర్శకత్వం చేసే ఆలోచన నాకు లేవు.
- భవిష్యత్ లో ఎంత ఎదిగినా అందరికీ అందుబాటులో ఇలాగే ఉంటాను.
- అల్లు అర్జున్ తో నా అనుబంధం బావుంటుంది. మంచి మోరల్ సపోర్ట్ నాకు బన్నీ ఇస్తారు. ఆయన నా దైర్యం.
- అట్లీ తో సినిమా తర్వాత 1.5 సంవత్సరాలలో 2 సినిమాలు చేయాలి అని బన్నీ అనుకుంటున్నారు.