త్వరలో థియేట్రికల్ & ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్న “గేమ్ ఆఫ్ ఛేంజ్” మూవీ

5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్‌ రాజశేఖర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మలయాళ దర్శకుడు సిధిన్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ రాజశేఖర్‌, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’. ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ మూవీగా తెరకెక్కిన “గేమ్ ఆఫ్ ఛేంజ్” సినిమా త్వరలో థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ మూవీని మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో….

ఈ సందర్భంగా నిర్మాత కథానాయకుడు సిద్ధార్థ్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘2018లో ‘ఇంటర్నెట్‌ లైఫ్‌ స్టైల్‌హబ్‌’ ప్రారంభించి, ఇప్పటివరకు 30 వేల మందికి డిజిటల్‌ కోచింగ్‌ ఇచ్చాను. నేను ఇంగ్లీష్‌లో రాసిన ‘యు కెన్‌ కోచ్‌’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం సినిమా రంగంపై వున్న మక్కువతో ఈరోజు నిర్మాతగా, నటుడిగా ‘గేమ్‌ అఫ్‌ చేంజ్‌’ చిత్రం తో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ సాధారణ క్షణాలు అసాధారణమైన జీవన మలుపులుగా మారతాయి. ‘గేమ్‌ ఆఫ్‌ చేంజ్‌’ అనే సినిమా ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం అని నమ్ముతున్నాను. సాధారణమైన క్షణాలు అసాధారణమైన మార్పులను రేకెత్తించిన పలు వ్యక్తుల ఆకర్షణీయమైన వ్యక్తిగత నిజ జీవిత కథనాలను మిళితం చేసి రూపొందించిన చిత్రమిది. భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు శా.శ 427లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన కొన్ని నిజ జీవితాల కథనాలతో ఈ చిత్రం రూపొందించాము.ఈ రోజు మా ప్రెస్ షోకు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. గేమ్ ఆఫ్ ఛేంజ్ మూవీని అన్ని ఏజ్ గ్రూప్స్ ప్రేక్షకుల కోసం రూపొందించాం. నాలుగు భాషల్లో డబ్బింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. మేల్, ఫీమేల్, చిల్డ్రన్ అందరికీ ఈ సినిమా నచ్చేలా ఉంటుంది. మా మూవీ ప్రతి ప్రేక్షకుడిలో స్ఫూర్తి నింపుతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం ఎందుకు జీవితంలో సాధించలేము అనే పట్టుదల మొదలవుతుంది. కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే మనం జీవితంలో ఎదుగుతామని చెప్పే చిత్రమిది. ఫిలింమేకింగ్ లో గతంలో మాకు ఎలాంటి అనుభవం లేదు. ఈ సినిమాతో ఫిలింమేకింగ్ ఎంత కష్టమో తెలిసింది. ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ మూవీగా గేమ్ ఆఫ్ ఛేంజ్..ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రివల్యూషన్ తీసుకొస్తుందని ఆశిస్తున్నాం.” అన్నారు.

మరో నిర్మాత మీనా చాబ్రియా మాట్లాడుతూ ‘‘ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేసాం. నేను మార్కెటింగ్ విభాగంలో 2 వేలకు పైగా సినిమాలకు పనిచేశాను. గేమ్ ఆఫ్ ఛేంజ్ తో ప్రొడ్యూసర్ గా పనిచేసే అవకాశాన్ని సిద్ధార్థ్ రాజశేఖర్ కల్పించారు. సినిమా అంటే ఎంత హంగామా, ఎంత ఖర్చుతో కూడుకున్నదో మనం చూస్తున్నాం. గేమ్ ఆఫ్ ఛేంజ్ ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ మూవీ. ఈ రోజుల్లో థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పించడం ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ నేటి మీడియా షోకు హౌస్ ఫుల్ అయ్యింది. ఇది మా మూవీకి ప్రేక్షకులు ఇవ్వబోయే సక్సెస్ కు చిన్న శాంపిల్. దేశవ్యాప్తంగా మేము ప్రమోషన్ చేస్తున్నాం. త్వరలోనే మా చిత్రాన్ని థియేట్రికల్, ఓటీటీ ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. గేమ్ ఆఫ్ ఛేంజ్ సినిమాకు సీక్వెల్స్ కూడా ఉంటాయి. నెక్ట్స్ మూవీ మరింత గ్రాండ్ గా రూపొందిస్తాం. గేమ్ ఆఫ్ ఛేంజ్ సినిమాను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ చేయాలన్నదే మా లక్ష్యం. ఈ ప్రయత్నంలో మీ సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నాం.” అన్నారు.

నటీనటులు : సిద్ధార్థ్ రాజ్ శేఖర్, ఎఫ్ టి బ్లెర్ సింగర్, సురెంద్రన్ జయకర్ తదితరుల

సాంకేతిక వర్గం :

బ్యానర్: సిద్ధార్థ్ రాజ్ శేఖర్ ప్రొడక్షన్స్
డైరెక్టర్ : సిధిన్
ప్రొడ్యూసర్స్: సిద్ధార్థ్ రాజ్ శేఖర్, మీనా చాబ్రియా
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీరాజ్ సాజి
సినిమాటోగ్రఫీ : ఆకాష్ సేథి
ఎడిటర్: అభిలాష్ బాలచంద్రన్
సహా నిర్మాత : స్వప్న రాజేశ్వరి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివ రాజ్
రచన :సిధిన్, షోయం
పి ఆర్ ఓ: రాంబాబు వర్మ

Related Articles

Latest Articles