ఓజీలో ఛాన్స్ మిస్ : ఆర్కే సాగర్

మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “ది 100”. రాఘవ్ ఓంకార్ శశిధర్ రచనా దర్శకత్వంలో మిష నారంగ్, ధన్య బాలకృష్ణ కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్ర టీజర్ మెగా మదర్ అంజనా దేవి గారు లాంచ్ చేయగా ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్ర ప్రమోషన్ల నిమిత్తం మీడియాతో మాట్లాడక తాను మిస్సయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అని మీడియా వారు ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆర్కే సాగర్ తాను ఓజి సినిమాలో ఒక క్యారెక్టర్ చేయాల్సిందని, కాకపోతే కొన్ని కారణాలవల్ల ఆ ఛాన్స్ మిస్ అయిందని, దానికి తను చాలా చింతిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ చెట్టు కంటెంట్ ను అందరూ ప్రశంసించిన తర్వాతే పవన్ కళ్యాణ్ దగ్గరికి ట్రైలర్ లాంచ్ చేయించేందుకు వెళ్లానన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు టైలర్ చూసి మెచ్చుకోగా చిత్రం ఎలా ఉంటుందో ఆయనకు చెప్పినట్లు, అది విన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తూ ఇటువంటి చిత్రాలు ప్రస్తుత సమాజానికి అవసరమని, అలాంటి ఒక కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు మా చిత్ర బృందాన్ని అభినందించారు అని ఆర్కే సాగర్ సమాధానం ఇచ్చారు.

Related Articles

Latest Articles