కోట శ్రీనివాసరావు గారు ఎప్పటికీ సజీవంగానే ఉంటారు – విష్ణు మంచు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, సీనియర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు (83) ఆదివారం (జూలై 13) నాడు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో డైనమిక్ హీరో విష్ణు మంచు సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘మాటల్లో చెప్పలేనటు వంటి ఓ గొప్ప నటుడు, లెజెండ్. శ్రీ కోట శ్రీనివాస్ గారు చనిపోయారనే వార్త తెలిసి నా గుండె బరువెక్కింది. అద్భుతమైన నటుడు, అసమాన ప్రతిభ, ఆయన ఉనికి ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ వెలుగు నింపింది. అది సీరియస్ పాత్ర అయినా, విలన్ అయినా, కామెడీ అయినా- ప్రతి పాత్రలోనూ ఆయన ప్రాణం పోశారు. అలాంటి అరుదైన ప్రతిభ కొద్దిమందికే దక్కుతుంది.

ఆయనతో చాలా సినిమాల్లో పనిచేసే అదృష్టం నాకు కలిగింది, ఇంకా చాలా సినిమాల్లో ఆయనను చూస్తూ పెరిగాను. ఆయన నటనే సినిమా పట్ల నాకు ఆరాధన భావనను పెంచింది.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మనం ఆయనను శారీరకంగా కోల్పోయి ఉండవచ్చు, కానీ ఆయన కళ, ఆయన నవ్వు, ఆయన ఆత్మ ఆయన అలంకరించిన ప్రతి సన్నివేశంలో సజీవంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం. మీరు ఎప్పుడూ మా గుండెల్లో నిలిచిపోయి ఉంటారు’ అని విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు.

Related Articles

Latest Articles