
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తరాంధ్ర సంస్కృతిని, గ్రామీణ జీవనాన్ని చిత్రిస్తూ భావోద్వేగాలు, సంగీతం, హాస్యంతో కూడిన వినోదాన్ని అందిస్తుంది. ఆనంది హార్మోనియం పట్టుకుని రిక్షాలో కూర్చున్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై, ఆమె పాత్ర ఆకట్టుకుంది.
తారాగణం: నరేష్, రాసి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశలిని.
సాంకేతిక బృందం:-
దర్శకుడు: గౌరి నాయుడు జమ్మూ
సినిమాటోగ్రాఫర్: జె. అదిత్య
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ


