“పోలీస్ వారి హెచ్చరిక” చిత్ర రివ్యూ

తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “పోలీస్ వారి హెచ్చరిక”. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి, బెల్లి జనార్థన్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం రివ్యూ విషయానికి వస్తే…

కథ :
సమాజంలో జరిగే కొన్ని సీరియల్ మర్డర్లపై పోలీసులు ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు. దీనిపై కొంతమంది సమాజ సంస్కర్తలు అటువంటి మర్డర్లు జరగకుండా పోలీసులు చూసుకోవాలని పోరాడుతూ ఉంటారు. అయినా ఆ హత్యలు ఆకకపోవడంతో సమస్య కాస్త రాష్ట్రస్థాయికి చేరి ముఖ్యమంత్రి ఎంతో ఆగ్రహానికి గురవుతారు. సమాజంలోని కొంతమంది అనాధలు అలాగే హిజ్రాల జీవితాలను ముడిపెట్టి ఈ హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హత్యలకు కారణం ఎవరు? అసలు హత్యలకు చేయడానికి దీని వెనుక ఉన్న కారణం ఏంటి? చివరికి ఈ హత్యలు ఆగుతాయా? హత్యలు చేస్తున్న వారిని, వారి వెనుక ఉన్న వారిని పోలీసులు పట్టుకుంటారా? ఈ హత్యలకు, అనాధలకు, హిజ్రాలకు సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై పోలీస్ వారి హెచ్చరిక సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ సినిమాలో ముఖ్యంగా మనకు మొదటినుండి కనిపించే పాత్ర సన్నీ అఖిల్. ట్రైలర్లో చూపించినట్లు ఒక మతిస్థిమితం లేని యువకుడిగా ఆ పాత్రలో సన్నీ అఖిల్ పరకాయ ప్రవేశం చేశారు. అలాగే పోలీసుగా జయ వాహిని అద్భుతమైన నటనను చూపించారు. సమాజ సంస్కర్తగా అజయ్ ఘోష్, గాయకుడిగా బాబ్జి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హిమజ, శుభలేఖ సుధాకర్, బిల్లి జనార్ధన్, జబర్దస్త్ వినోద్ తదితరులు తమ పాత్రలో నటిస్తూ చిత్రానికి సపోర్టుగా నిలిచారు. బెల్లి జనార్ధన్ తన పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. భవిష్యత్తులో ఆయనకు తగ్గ పాత్రలు ఈ చిత్రం ద్వారా మరిన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. షియాజి షిండే తెరపై తక్కువగా కనిపించినప్పటికీ మంచి ఇంపాక్ట్ వచ్చేలా నటించారు. అలాగే చిత్తంలో నటించిన పాత్రలకు తగ్గట్లు నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు. కొన్ని పాత్రలు గ్రే షేడ్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి.

సాంకేతిక విశ్లేషణ :
సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా వెండితెరపై చూపించడంలో బాబ్జి సక్సెస్ అయ్యారు. సినిమా కాస్త స్లోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా రూపుదిద్దారు. చాలా వరకు లోకేషన్లు నాచురల్ గా ఉండటంతో ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా క్వాలిటీ చూస్తే ఎక్కడ నిర్మాణ ఖర్చులో కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదు. పాటలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొంతమంది ఆర్టిస్టులు కొత్తవారు కావడం సినిమాకు చిన్న మైనస్ గా చెప్పుకోవచ్చు. కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విలువలు బాగానే ఉన్నాయి.

చిత్ర విశ్లేషణ :
ఇక సినిమా విషయానికి వస్తే ఒక చక్కటి సందేశాత్మక చిత్రం కావడంతో స్క్రీన్ ప్లే కాస్త నిదానం కనిపిస్తుంది. పొలిటికల్, యాక్షన్ ఇంకా కొన్ని సీన్లు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. కొన్ని పదాలు సమాజంలోని కొన్ని వర్గాల ప్రేక్షకులకు నొప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనాధలుగా ఉన్నవారిని సమాజంలో ఎవరైనా పెంచే విధానాన్ని బట్టి వారు ఎటువంటి మనుషులు అవుతారో ఈ చిత్రం ద్వారా ఒక ఉదాహరణగా తెలుసుకోవచ్చు. కొంతమంది కీలకపాత్రలు పోషించిన నటీనటులు కొత్త వాళ్లు కావడంతో కొన్ని సీట్లు అంతగా పండలేదు.

ప్లస్ పాయింట్స్ :
కథ, పాటలు, నటీనటుల నటన, సందేశం.

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే, కొన్ని డైలాగ్స్, కొంతమంది కొత్త నటులు.

సారాంశం :
సందేశాత్మకంగా ఉండే ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆలోచింపజేసే చిత్రం.

Related Articles

Latest Articles