యథార్థ సంఘటనల ఆధారంగా “చేతబడి”

శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం చేతబడి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ కథను గురించి తెలియజేస్తూ దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ..”చేతబడి అనేది 16 వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కల. రెండు దేశాలు కొట్టుకోవాలన్న రెండు దేశాలు కలవాలన్న.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది. 1953 గిరిడ అనే గ్రామంలో రియల్ గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్ గా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నాం” అని చెప్పారు.

నిర్మాత నందకిషోర్ మాట్లాడుతూ..”ఒకప్పుడు బాణామతి భయం వల్ల రాజకీయ, సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకున్న వారి గురించి ఈ చేతబడి చిత్రంలో రియలిస్టిక్ గా చూపించబోతున్నాం” అని అన్నారు.

బ్యానర్ : శ్రీ శారద రమణా క్రియేషన్స్

కథ, దర్శకత్వం : సూర్యాస్

నిర్మాత : నంద కిషోర్

సహ నిర్మాత : నరేష్ జైన్

క్రియేటివ్ హెడ్ : దీపిం టి అగర్వాల్

సంగీతం : అచ్చు రాజమణిసి

నిమాటోగ్రాఫర్ : మిర్లాన్ నజీర్

ఎడిటర్ : వంశీ

కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రియాంక

ప్రొడక్షన్ డిజైనర్ : ఏ రామాంజనేయులు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నవీన్ బుక్క

చీఫ్ కో డైరెక్టర్ : హరిఅసిస్టెంట్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జోసెఫ్

పిఆర్ఓ : జీకే మీడియా (గణేష్, కుమార్)

Related Articles

Latest Articles