విజయ్ దేవరకొండ “కింగ్డమ్” చిత్ర రివ్యూ

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా సత్యదేవ్ సపోర్ట్ చేస్తూ మరో హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తూ నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. చిత్రానికి అనిరుద్ తన సంగీతాన్ని అందించారు. అయ్యప్ప, అవినాష్, వెంకటేష్, గోపిరాజు రమణ, మహేష్ ఆచంట, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :

ఒక మధ్యతరగతి కుటుంబాన్ని అన్నదమ్ములు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల చిన్నతనంలోనే విడిపోవడం జరుగుతుంది. పెద్దన్న తర్వాత తమ్ముడు తన అన్న కోసం వెతుకుతూ తనకు సంబంధం లేని మరొక ప్రపంచంలోకె అడుగు పెడతాడు. టైలర్ లో చూపించినట్లు తన అన్న కోసం వెళ్లిన తమ్ముడు తన అన్నని వెనక్కి తీసుకుని వస్తాడా లేదా తన అన్నతోనే అక్కడ ఉండిపోతాడా? అసలు ఆ ప్రపంచం ఎలా ఉండబోతుంది? అక్కడ తన అన్న లీడర్గా ఎదగడానికి గల పరిస్థితులు ఏంటి? అటువంటి పరిస్థితులనుండి తమ్ముడు ఎలా బయటపడతాడు? అసలు పైగా తమ్ముడు అటువంటి ప్రదేశానికి వెళ్లడానికి కారణం తన అన్న మాత్రమేనా లేదా ఇంకేమైనా ఉందా? అని చిక్కు ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రెండు తెరపై కింగ్డమ్ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటులు నటన :

సినిమాలో సూరి గా నటించిన విజయ్ దేవరకొండ అద్భుతమైన నటనను చూపించారు. గతంలో ఎన్నడూ లేని ఒక కొత్త క్యారెక్టర్ ను ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చేయడం విశేషం. ఒక సాధారణ కానిస్టేబుల్ నుండి మొదలై ఒక ఖాదీగా అలాగే మరొక చోట మరొక రూపంలో కనిపిస్తూ అటు లుక్స్ పరంగా అలాగే ఇటు క్యారెక్టర్ నుండి చేంజ్ అవుతూ సినిమా మొదల నుండి చివరి వరకు ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

శివగా సత్యదేవ్ సినిమాలో సుమారు అంతట కనిపిస్తూ అద్భుతమైన నటనను నటించారు. ఈ సినిమాతో సత్య దేవ్ మరొకసారి నటనలో తన వరుసగాలిటీ చూపించుకున్నారు. ఒకవైపు నుండి తన ప్రజలను కాపాడుకునే నాయకుడిలా అలాగే మరొకవైపు నుండి తన తమ్ముడి కోసం ఎంతో ఆరాటపడే అన్నల మంచి పర్ఫార్మన్స్ ఇచ్చారు.

భాగ్యశ్రీ బోర్సే వెండి తెరపై కనిపించే స్క్రీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రను పోషించారు. అయితే మరి కాస్త ఎక్కువ సమయం కనిపిస్తే బావుండు అని అనిపిస్తుంది.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నెగిటివ్ పాత్ర పోషించిన వెంకటేష్. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తగా ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్న వెంకటేష్ ఈ సినిమాలో అద్భుతమైన నటనను నటించారు. ప్రేక్షకులు తన నటనకు అభిమానులు అయ్యేంత పర్ఫార్మెన్స్ వెంకటేష్ ఇవ్వడం ఆశ్చర్య పరుస్తుంది. సినిమాలో తాను కనిపించినప్పటి నుండి మొదలై తన క్యారెక్టర్ చివరి వరకు కూడా బ్యాలెన్స్ యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకునేలా నటించారు.

చిత్రంలో ఇతర పాత్రలో పోషించిన రాజకుమార్ కసిరెడ్డి, మహేష్ ఆచంట తదితరులు అంతా తమ పాత్రకు తగ్గట్లు పర్ఫార్మ్ చేస్తూ సినిమాకు ప్లస్ గా నిలిచారు. అలాగే ఇతర నటినట్లు అంతా తమ తమ పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బోనస్ అయ్యారు.

సాంకేతిక విశ్లేషణ :

గౌతమ్ తిన్నానూరి తాను రాసుకున్న కథను వెండితలపై ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా అద్భుతమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో విజయం సాధించారు. సినిమాకు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయింది. అనిరుద్ అటు పాటలతో పాటు ఇటు బిజిఎం కూడా అద్భుతంగా ఇచ్చారు. కొన్ని యాక్షన్ సీన్లలో అయితే గూస్బమ్స్ వచ్చే విధంగా ఉంది. పాటలు అంతగా ప్రేక్షకులను సంతృప్తి అర్చనప్పటికీ బీజీఎం మాత్రం అదరగొట్టేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లొకేషన్లో ఇంకా హార్ట్ వర్కులు చాలా బాగా వచ్చేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ, నటీనటుల నటన, బిజిఎం.

మైనస్ పాయింట్స్ :

పాటలు, కొన్ని సీన్లు.

సారాంశం :

అన్నదమ్ముల మధ్య ఉండే బలమైన బంధాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా కుటుంబ సమేతంగా అన్ని కమర్షియల్ టచ్ లతోను వచ్చి చూసేలా కింగ్డమ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Related Articles

Latest Articles