ఫెడరేషన్ డిమాండ్ లపై స్పందించిన ఫిలిం ఛాంబర్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వేతనాలపై ఫెడరేషన్ 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ రేపు బందును ప్రకటించింది. ఈ కారణంగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ దీనిపై స్పందిస్తూ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది.

“ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం, నైపుణ్యం ఉన్నవారికి మరియు లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాము. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.

చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాము. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతుంది.

నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా, ఛాంబర్ జారీ చేసే మార్గనిర్దేశాలను ఖచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాము.

శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి. ఇంకా వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.”

Related Articles

Latest Articles