
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “కింగ్డమ్” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కేరళలో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. నాన్ మలయాళ వెర్షన్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఏకైక చిత్రంగా కింగ్డమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేరళలో కింగ్డమ్ సినిమాకు వస్తున్న వసూళ్లు తమను సర్ ప్రైజ్ చేస్తున్నాయని ఇటీవల నిర్మాత నాగవంశీ చెప్పారు.
ఫస్ట్ వీక్ సక్సెస్ ఫుల్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమాకు పెద్ద సంఖ్యలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కింగ్డమ్ సినిమా నిలవనుంది. అలాగే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు మరో సూపర్ హిట్ గా ఈ సినిమా మారింది.