
వైవిధ్యమైన కథలు, సవాల్‌తో కూడిన పాత్రలకు పేరుగాంచిన నటుడు దుల్కర్ సల్మాన్ తన 41వ చిత్రం #DQ41 కోసం కొత్త దర్శకుడు రవి నేలకుదిటితో జతకట్టారు. ఈ సమకాలీన ప్రేమకథ మానవ డ్రామాతో ముడిపడి ఉంటుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో SLV సినిమాస్ బ్యానర్‌పై #SLV10గా రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. నాని క్లాప్‌బోర్డ్‌తో షూట్ ప్రారంభించగా, బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రీకాంత్ ఒడెలా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది. అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.