
ప్రముఖ సినీ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తన కుమారుడు నామకరణం కోసం తిరుమలకు వచ్చిన కిరణ్, బాబుకు ‘హను అబ్బవరం’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనం చాలా సంతృప్తికరంగా జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘కే ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ నెలలో మరో కొత్త సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు.


