
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ తనపై వస్తున్న బెట్టింగ్ యాప్స్ ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. కొన్ని మీడియా చానళ్లు తనను బెట్టింగ్ యాప్స్‌తో ముడిపెడుతూ వార్తలు ప్రచురిస్తున్నాయని, అవి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఎండోర్స్ చేసింది బెట్టింగ్ యాప్స్ కాదు, లీగల్ గేమింగ్ యాప్స్ అని విజయ్ స్పష్టం చేశారు.
“గేమింగ్ యాప్స్‌కి, బెట్టింగ్ యాప్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. నేను ప్రమోట్ చేసిన A23 ఒక లీగల్ గేమింగ్ యాప్. ఈ గేమింగ్ యాప్స్ ఇండియా క్రికెట్ టీం, ఇండియా విమెన్స్ క్రికెట్ టీం, ఇండియా ఒలంపిక్ టీం, ఐపీఎల్, కబడ్డీ టీంలకు స్పాన్సర్‌షిప్ అందిస్తున్నాయి” అని విజయ్ దేవరకొండ తెలిపారు.
అంతేకాకుండా తన బ్యాంక్ లావాదేవీలన్నింటినీ ఈడీకి సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. “నేను లీగల్‌గా ఉన్న గేమింగ్ యాప్స్‌ను మాత్రమే ప్రమోట్ చేశాను. నా పై వస్తున్న ఆరోపణలు సరికాదు” అని విజయ్ స్పష్టం చేశారు.


