సెప్టెంబర్ 12న థియేటర్లలో ‘కిష్కిందాపురి’

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్-మిస్టరీ థ్రిల్లర్ కిష్కిందాపురి సెప్టెంబర్ 12న విడుదల కానుంది. కౌశిక్ పేగళ్లపాటి దర్శకత్వంలో, సాహూ గరపాటి నిర్మాణంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

హారర్, మిస్టరీ, ఎమోషనల్ డ్రామా మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రక్తపు మచ్చలతో కనిపించడం, పాడైపోయిన రేడియో, భూతబంగ్లా, అగ్నికి ఆహుతైన వాహనం వంటి విజువల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ ఉండిపోవే నాతోనే మాత్రం రొమాంటిక్ టచ్‌ను అందించింది.

సామ్ సి‌ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిన్మయ్ సలస్కర్ సినిమాటోగ్రఫీ, మణీషా ఏ దత్ ప్రొడక్షన్ డిజైన్, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ వేగంగా జరగనున్నాయి.

Related Articles

Latest Articles