గుర్తుపట్టలేని లుక్ లో సత్య దేవ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల GMB ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన రావు బహదూర్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. సత్య దేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సైకలాజికల్ డ్రామా, క్షీణిస్తున్న సంప్రదాయ కుటుంబ నేపథ్యంలో రూపొందింది. A+S మూవీస్ శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌లో హై-క్వాలిటీ ప్రొడక్షన్ విలువలతో తెరకెక్కుతోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సత్య దేవ్ రాజసం, డీకే, మానసిక సంఘర్షణను సూచించే అద్భుతమైన లుక్‌లో కనిపిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున “నాట్ ఈవెన్ ఎ టీజర్” అనే ప్రత్యేక వీడియో థియేటర్లలో ఆగస్టు 18న డిజిటల్‌లో విడుదల కానుంది.

వెంకటేష్ మహా రచన, దర్శకత్వం, ఎడిటింగ్‌తో పాటు, కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ, స్మరణ్ సాయ్ సంగీతం, రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైన్‌తో ఈ చిత్రం అద్భుత విజువల్ అనుభవాన్ని అందించనుంది.

“ఇది ప్రపంచానికి అందించే తెలుగు కథ,” అని మహా అన్నారు. సత్య దేవ్ మాట్లాడుతూ, “రావు బహదూర్‌గా ఐదు గంటల మేకప్‌తో పాత్రలో ఒదిగిపోయాను,” అని చెప్పారు.

2026 వేసవిలో తెలుగుతో పాటు బహుభాషా సబ్‌టైటిల్స్‌తో గ్లోబల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న రావు బహదూర్ భారతీయ సినిమాల్లో అత్యంత ఆసక్తికరమైన చిత్రంగా నిలవనుంది.

Related Articles

Latest Articles