
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. “లిటిల్ హార్ట్స్” ట్రైలర్ పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది.
నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న