
తేజ సజ్జ, రితిక నాయక్ జంటగా నటిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ద్వారా టీజీ విశ్వప్రసాద్, క్రితి ప్రసాద్ నిర్మాతగా కార్తీక్ ఘట్టమనేని రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిరాయ్. ఈ చిత్రానికి కార్తీక్ స్వయంగా డిఓపిగా పని చేయగా మణిబాబు డైలాగులను అందించారు. హరిగౌర చిత్రానికి సంగీతాన్ని అందించగా మంచు మనోజ్, జగపతిబాబు, శ్రేయ, జయరాం తదితరులు కీలకపాత్రల పోషించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
భారతదేశ చరిత్రలో అశోకుడు గురించి అందరికీ తెలిసిందే. అయితే నాడు అశోకుడు తన జ్ఞానాన్ని అంతా తొమ్మిది గ్రంథాలలో భద్రపరిచి ప్రపంచంలోని వేరే వేరు ప్రాంతాలలో ఉన్న తొమ్మిది మంది యోధులకు అప్పగించి వాటిని తరతరాలుగా రక్షించవలసిందిగా ఆదేశిస్తారు. అయితే ఆ గ్రంథాలను అన్నింటిని దక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలి అనుకునే వ్యక్తిని అడ్డుకొని కాపాడటమే ఒక యోధుని బాధ్యత. అసలు బ్లాక్ స్వోర్డ్ అనే వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని ఆపి ప్రపంచాన్ని రక్షించే యోధ ఎవరు? యోధ బ్లాక్ స్వోర్డ్ ను ఆపగలుగుతాడా? చివరికి ప్రపంచం ఏమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెరపై ఈ చట్టం చూడాల్సిందే.
నటీనటుల నటన :
చిత్రంలో యోధగా కనిపించిన తేజ సజ్జ తన అద్భుతమైన నటనతో మరోసారి సూపర్ హీరో అని నిరూపించుకున్నాడు. బ్లాక్ స్వోర్డ్ గా మంచు మనోజ్ ఈ చిత్రం ద్వారా మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. ప్రేక్షకులను కట్టి పడేసే అంత గొప్ప పర్ఫామెన్స్ తో మంచు మనోజ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. నటి శ్రేయ తన పర్ఫార్మెన్స్ తో తనదైన శైలిలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రితికా నాయక్ తన పాత్ర పరిధిలో తాను నటిస్తూ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. జగపతిబాబు, జయరాం తదితరులు తమ పాత్రల పరిధిలో నటిస్తూ తక్కువ సమయం కనిపించినప్పటికీ మంచి ఇంపాక్ట్ సృష్టించారు. గెటప్ శీను తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో అందించారు.
సాంకేతిక విశ్లేషణ :
తమ్ముడు అనుకున్న కథను వెండితెరపై తీసుకొచ్చి ప్రేక్షకులను అందించడంలో దర్శకుడు కార్తీక్ సక్సెస్ చేయడం చెప్పుకోవాలి. ఒక విజువల్ ఫీస్ట్ లాగా ప్రేక్షకులను ప్రతి సీనులను కట్టిపడేశారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయి. విజయం చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ లాగా నిలిచింది. స్టంట్స్ ఇంకా ఫైట్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా చిత్రం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటూ విజయాన్ని సాధించింది. మరి ముఖ్యంగా సినిమాలోని కొన్ని చారిత్రక అలాగే రామునికి సంబంధించిన సీన్లు రోమాలు నిక్కపరచుకునేలా చేశాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, విఎఫ్ఎక్స్, నటీనటులు నటన, బిజిఎం.
మైనస్ పాయింట్స్ :
కొన్ని అనవసరమైన క్యారెక్టర్లు, కొన్ని సీన్స్ లాగ్ ఉండటం.
సారాంశం :
దేశ చరిత్రను ముడి పెట్టుకుని అటు ధర్మాన్ని అలాగే ఇటు దైవత్వాన్ని కలుపుతూ మంచి విజువల్ ట్రీట్ తో సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించడంలో మిరాయ్ విజయం సాధించింది.


