
దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను “మా వందే” టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని “మా వందే” సినిమాలో చూపించనున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేశారు.మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని సంఘటనలు, విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్న సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే “మా వందే” చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ నిర్మిస్తున్నట్లు పేర్కొంది చిత్ర బృందం.


