
కోలీవుడ్ హీరో అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తూ వచ్చిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజు నాయక్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా హరి కిరణ్ సినిమాటోగ్రఫీ చేశారు. యశ్వంత్ కాకమాను కీలకపాత్ర పోషించారు. నేను విడుదలైన చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒక నగరంలో జరిగిన ఘటనలో ఒక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సిబ్బంది అంతా మరణించడం జరుగుతుంది. ఆ స్థానంలోకి కొంతమంది కొత్తగా చేరతారు. అయితే డ్యూటీలో చేరిన మొదటి రోజే వారికి ఒక ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం ఇటువంటిది? ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేవారు నిలబడతారా లేదా? ఆ ప్రమాదానికి వారికి సంబంధం ఏంటి? అనే ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
చిత్రంలో హీరో అథర్వా ఒక పోలీసు పాత్రలో అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇచ్చారు. గతంలో కూడా తాను ఇటువంటి పాత్రను పోషించినప్పటికీ ఈ సినిమాలో తనదైన మార్క్ సృష్టించారు.
లావణ్య త్రిపాఠి కేవలం ఒక హీరోయిన్ పాత్రలో కాకుండా తనకంటూ కొంత ప్రాముఖ్యతతో తనదైన ముద్రను తన పాత్రతో వేసుకున్నారు.
యశ్వంత్ కాకమాను విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రతి సీన్ ఎమోషన్ ఇంకా యాక్షన్ లో తనదైన శైలిలో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించారు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ ఇంకా ఇతర అంశాలలో ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.
చిత్రంలోని ఇతర కీలకపాత్రలు పోషించిన నటీనటులు తమ తమ పాత్ర పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బోనస్ గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
కాస్త రెగ్యులర్ కథ అయినప్పటికీ ఆ కథను వెండి తెరపై చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. ప్రతి సీను ఎలా ఉంటుందో అని ఉత్సాహంతో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ త్రిల్లర్ లా ఫీల్ అయ్యేంత అద్భుతంగా దర్శకత్వ వహించారు. చిత్రంలోని ఎక్కువ లొకేషన్లు ఒక స్లమ్ ఐడియా కావడంతో పూర్తిగా నేచురల్ లోకేషన్ అర్థమవుతుంది. సినిమాలోని ఎక్కువ కథ రాత్రిపూట కావడంతో లైటింగ్ ఇంకా ఎఫెక్ట్లు విషయంలో చాలా జాగ్రత్త పట్టారు. సిట్యువేషన్ కు తగ్గట్లు పాటలతో అలాగే సీన్లకు తగ్గ బీజీయంతో సంగీతం చాలా బాగా వచ్చింది. కొన్ని సీన్లు అంత ఎంగేజింగ్ గా లేనప్పటికీ ఓవరాల్ గా చూస్తే బాగుంది. సినిమాలో లవ్ స్టోరీ కాస్త బోర్ కొట్టినప్పటికీ పాత్రల ప్రాముఖ్యత వల్ల సినిమాకు ప్లస్ గా మారింది. కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్స్ ఇంకా ఇతర సాంకేతిక విశేషాలు బాగానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్ :
లవ్ స్టోరీ, కొన్ని సీన్లు.
సారాంశం :
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను చూసే ప్రతి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా కుటుంబంతో సహా చూడదగిన సినిమా టన్నెల్.


