
రిషబ్ శెట్టి దర్శకత్వంలో, నటనలో సృష్టించిన ‘కాంతార’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే భారీ హైప్‌తో ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం.
ఈ సినిమా కన్నడలో రూపొందినప్పటికీ, పాన్ ఇండియా స్థాయిలో డబ్బింగ్‌తో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రతి భాషలో ఒక స్టార్ హీరో ట్రైలర్‌ను లాంచ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగులో డార్లింగ్ ప్రభాస్, హిందీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళంలో శివ కార్తికేయన్ తమ సోషల్ మీడియా ద్వారా సెప్టెంబర్ 22, సోమవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు.
హోంబాలే ఫిల్మ్స్ నిర్మాణంలో, ఇప్పటికే సూపర్ హిట్స్ అందించిన బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రం కన్నడ సినీ పరిశ్రమకు మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది. 1000 కోట్ల క్లబ్‌లో చేరే తదుపరి కన్నడ చిత్రంగా ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే అంచనాలను రూపొందించుకుంది. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ ట్రైలర్ రిలీజ్‌తో ‘కాంతార చాప్టర్ 1’ మరింత హైప్‌ను సృష్టించనుంది. సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, మరో చారిత్రక విజయాన్ని రిషబ్ శెట్టి అందిస్తాడని ఆశిస్తున్నారు.


