అక్టోబర్ 31న ‘ఆర్యన్’ తెలుగులో విడుదల

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన విష్ణు విశాల్, గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా & ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కే దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన టీజర్ అద్భుతమైన స్పందనను రాబట్టింది, ఇందులో విష్ణు విశాల్ పోలీసు అధికారిగా కనిపిస్తారు.

అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్రేష్ట్ మూవీస్ ద్వారా హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. గతంలో విక్రమ్, అమరన్, థగ్ లైఫ్ వంటి బ్లాక్‌బస్టర్‌లను విడుదల చేసిన బ్యానర్ ఇది, కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో విస్తృత విడుదల ఆశించవచ్చు.

ప్రధాన పాత్రల్లో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి కనిపిస్తారు. సపోర్టింగ్ రోల్స్‌లో సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాలా పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ ఉన్నారు. మను ఆనంద్ సహ రచయితగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్, సంగీతం: ఘిబ్రాన్, ఎడిటింగ్: సన్ లోకేష్.

Related Articles

Latest Articles