
కర్నూలు (D) దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో జరిగిన కర్రల సమరంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతుల్లో ముగ్గురిని.. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజు, కర్ణాటకకు చెందిన బసవరాజుగా పోలీసులు గుర్తించారు. నాలుగో వ్యక్తి ఎడమ చేతిపై NBK అని పచ్చబొట్టు ఉందని, బంధువులు కానీ, మిత్రులు కానీ గుర్తిస్తే హొళగుంద ఎస్ఐ 91211 01161, ఆలూరు సీఐ 91211 01157 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.