పద్మశ్రీ డా. బ్రహ్మానందం చేతుల మీదుగా ప్రారంభమైన ‘ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ బర్గ్’

డాక్టర్ సుహాస్ బి శెట్టి నేతృత్వంలోని ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ బర్గ్ ఇప్పుడు హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ ఏరియాలో ఘనంగా ప్రారంభమైంది. దసరా సందర్భంగా ఈ కొత్త బ్రాంచ్‌ను పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఘనంగా ప్రారంభించారు. ఆర్గానిక్ పదార్థాల ద్వారా తయారైన ఐస్ క్రీమ్‌లను ఆస్వాధించేందుకు అందరినీ ఆహ్వానించారు. దసరా శుభ సందర్భంగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మారింది. అందరికీ ఆరోగ్యకరమైన, ఆర్గానిక్ పదార్థాలతో ప్రత్యేకంగా రూపొందించబడిన ఆహ్లాదకరమైన ఐస్ క్రీంలను అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి లెజెండరీ నటుడు, పద్మశ్రీ డాక్టర్ కె. బ్రహ్మానందం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కొత్త వెంచర్ అద్భుతంగా విజయవంతం అవ్వాలని కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నీలోఫర్ కేఫ్ అధినేత ఎ. బాబు రావు గారు, సుమన్ టీవీ అధినేత సుమన్ దూడి గారు ప్రత్యేక అతిథులుగా సందడి చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవనీయులైన అతిథులందరూ ఐస్‌బర్గ్ ఆర్గానిక్ క్రీమరీలోని పదార్థాల్ని రుచి చూసి, సేంద్రీయ పదార్థాల పట్ల వారి నిబద్ధతను ప్రశంసించారు.

Related Articles

Latest Articles