
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ సోమవారం కర్ణాటక రాష్ట్రానికి పర్యటనకు వెళ్లారు. ఆయన హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్ గౌడ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. బెంగుళూరు సమీపంలోని చింతామణి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయంత్రం బెంగళూరులో గోపాల్ గౌడ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆయనకు అభిమానులు, ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.


