
దివంగత నటుడు కృష్ణం రాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. చత్రపతి, మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఎన్నో హిట్ చిత్రాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. అప్పటినుండి ప్రభాస్ ఏ సినిమా అయినా వెయ్యి కోట్లు కలెక్షన్ సాధించడంతో ప్రభాస్ సినిమాలు అంటే కచ్చితంగా హిట్ పడుతుంది అని అందరూ ఫిక్స్ అయిపోయేలా చేశారు.
అయితే ప్రతి సినిమాకు ప్రస్తుతానికి 150 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్కు సుమారు 250 కోట్ల రూపాయలు ఆస్తి అలాగే నిర్మాణ సంస్థలలో పెట్టుబడులు ఉన్నట్లు, అదేవిధంగా ఇటలీ ఇంకా భారతదేశంలోని పలు పెద్ద నగరాలలో అపార్ట్మెంట్లు, కొన్ని టాప్ లక్సరీ కారులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు ఉండగా కల్కి 2, సలార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్.


