
నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అని అందరికీ తెలిసిన విషయమే. మంచు మోహన్ బాబు గారు ప్రభాస్ ను సరదాగా బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరి బాండింగ్ బుజ్జిగాడు చిత్రం నుండి మరింత బలోపేతమైంది. అప్పటి నుండి మనం ఎక్కడ ఈ ఇద్దరి టాపిక్ వచ్చిన మోహన్ బాబు గారు ప్రకాష్ ను బావ అంటూ సంబోధించడం చూస్తూనే ఉన్నాము. ఇటీవల కన్నప్ప చిత్రంలో కూడా ప్రభాస్ నటించడం, ఆ పాత్ర చిత్రానికి మరింత బలం కావడం విశేషం. కాగా నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో తన సోషల్ మీడియా అయిన X నుండి ప్రభాస్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, త్వరలో పెళ్లి చేసుకుని అరడజన్ మంది పిల్లలతో తనని చూడాలని కోరుకుంటున్నాను అని ఆ ట్వీట్ లో మోహన్ బాబు తెలిపారు.
https://x.com/themohanbabu/status/1981242547482534252?t=j5BQ2HAckk97DJvmSdVlaQ&s=19


