‘బైసన్’ చిత్ర రివ్యూ

Oplus_16908288

విక్రమ్ ధృవ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్ పై సమీర్ నయర్, దీపక్ సెగల్, రంజిత్, అదితి ఆనంద్ నిర్మాతలుగా నేను ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బైసన్. ఈ చిత్రాన్ని జగదాంబ ఫిలిమ్స్ వారు తెలుగులోకి తీసుకుని రావడం జరిగింది. నివాస్ కె ప్రసన్న ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా సినిమాటోగ్రఫీ చేశారు. పశుపతి, రజిష విజయన్, లాల్, అమీర్ సుల్తాన్ తదితరులు కీలకపాత్రను పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక వెనుకబడిన ప్రాంతంలోని చాలా సాధారణ కుటుంబం నుండి ఒక వ్యక్తి అంతర్జాతీయ క్రీడా స్థాయికి తనకు ఉన్న అడ్డంకులన్నీ దాటుకుని ఎలా ఎదుగుతారు అనే ప్రయాణమే ఈ చిత్రకథ. తన ప్రయాణంలో అక్కడ జరిగే లోకల్ గొడవలు తమ జీవితంపై, తన ఎదుగుదలపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? ఆ గొడవలలో తాను ఇరుకుంటాడా లేదా ఎలాగైనా కష్టపడి బయటపడతాడా? అటువంటి గొడవలలో తాను ఉన్నప్పుడు ఎలా బయటపడతాడు? తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని తన భవిష్యత్తు క్రీడ కోసం వదిలేస్తాడా లేక తనతోనే నిలబడతాడా? చివరికి తాను అనుకునేది సాధిస్తాడా లేక పరిస్థితుల ప్రభావం వలన తలవంచుతాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో ఒక కబడ్డీ ఆటగాడుగా ధృవ్ విక్రమ్ ఎంతో బాగా నటించారు. తన పర్సనాలిటీకి తగ్గట్లు మంచి ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ చిత్రంలో తన పాత్రకు తగ్గట్లు హెయిర్ స్టైల్ నుండి ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అనుపమ పరమేశ్వరన్ ఒక పల్లెటూరి అమ్మాయిల చాలా అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇచ్చారు. లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. అలాగే రజిష విజయన్, పశుపతి పాత్రలు చిత్రమంతట కనిపిస్తూ కీలకపాత్రలు పోషించారు. లాల్, అమీర్ సుల్తాన్ తమ తమ పరిధి పాత్రలో నటిస్తూ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు. అలాగే చిత్రంలోని ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్ గా ఇచ్చారు. ప్రతి పాత్ర ఒక పల్లెటూరి వింటేజ్ లుక్కుతో నాటి పరిస్థితులను ప్రతిభంబిస్తూ చిత్రంలోని క్యారెక్టర్స్ అని మరింత ఇంటెన్సిఫైడ్గా సినిమాను ముందుకు తీసుకువెళ్లాయి.

సాంకేతిక విశ్లేషణ :
1990 కాలంనాటి పరిస్థితులను ఆధారంగా దర్శకుడు రాసుకున్న కథను వెండితెరపై చూపించడంలో విజయం సాధించారు. అటు ఎమోషన్ నుండి ఇటు కథ వరకు ప్రతి విషయం లను తగ్గ జాగ్రత్తలు తీసుకొని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. సాధారణంగా నాటి పరిస్థితులకు తగ్గట్లు లొకేషన్ ఇంకా ఇతర వింటేజ్ విషయాలలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఫ్రేమ్స్ ను ఎంతో అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యారు. అలాగే చిత్రంలోని పాటలు సీన్ కు తగ్గట్లు ఎంతో అమోషన్ను పండించాయి. బిజిఎం అద్భుతంగా వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డిఐ, కలర్ ప్యాలెట్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు అద్భుతంగా సెట్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల నటన, ఎమోషన్.

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొంచెం స్లోగా ఉండటం.

సారాంశం :
కుటుంబ సమేతంగా మంచి మానవతా విలువలతో ఎమోషన్స్ పరంగా ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా అందరూ కలిసి వెండి ధరపై చూడదగ్గ చిత్రం బైసన్.

Related Articles

Latest Articles