అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా ‘రోలుగుంట సూరి’ మూవీ సాంగ్ లాంచ్

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’. ఈ మూవీ ఫ‌స్ట్ సాంగ్‌ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ లాంగ్ చేశాడు. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ (Bhawana Neelap) హీరోహీరోయిన్లుగా తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మిస్తున్నారు.

ఫ‌స్ట్ సాంగ్‌ను ఆవిష్కరించిన అనంతరం మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – “మంచి పాట‌లు ఉంటే ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌చ్చి హిట్ చేస్తారు. క‌థ‌తో పాటు మ్యూజిక్ కూడా బాగుంటే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన‌ట్టే. ‘రోలుగుంట సూరి’ కూడా అలాంటి సినిమా. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగ న‌చ్చే క‌థ‌తో పాటు దానికి త‌గ్గ‌ట్టే మ్యూజిక్ కూడా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు” అని అన్నారు.

దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ – “మా సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను ఆవిష్కరించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కృషిని, మా టీం టాలెంట్‌ను ఆయన ప్ర‌త్యేకంగా అభినందించ‌డం ఎంతో సంతోషంగా ఉంది. స‌బ్జెక్టుతో పాటు పాట‌లు కూడా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతాయ‌నే న‌మ్మ‌కం ఉంది” అని తెలిపారు.

నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ – “ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నామ‌ని తెలుపుట‌కు సంతోషంగా ఉంది. రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైంది. చిత్ర‌యూనిట్‌లోని ప్ర‌తి స‌భ్యుడు టాలెంట్ చూపిస్తూ సినిమా అవుట్‌ఫుట్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్తున్నారు.” అని తెలిపారు.

తెలుగులో ఒక అరుదైన‌, అద్భుత‌మైన సినిమాగా ‘రోలుగుంట సూరి’ నిలిచిపోవ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌ యూనిట్ సభ్యులు న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు.

నటీనటులు: నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్, బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా, జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక విభాగం:
నిర్మాత: సౌమ్య చాందిని పల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఊరికూటి తాతారావు, పల్లా సత్యనారాయణ
దర్శకుడు: అనిల్ కుమార్ పల్లా
సంగీతం: సుభాష్ ఆనంద్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సందీప్ చక్రవర్తి
ఎడిటింగ్ , ఆడిషనల్ స్క్రీన్ ప్లే : ఆవుల వెంకటేష్
కథ, డైలాగ్స్: మహ్మద్ సాయి
ఫైట్స్: వాసు
ఆర్ట్ డైరెక్టర్: రమేష్
కో-డైరెక్టర్: సుభాష్ రెడ్డి
పబ్లిసిటీ డిజైన్: ఇమేజ్ 7 అడ్వర్టైజింగ్

పీఆర్వో: క‌డ‌లి రాంబాబు,ద‌య్యాల అశోక్

Related Articles

Latest Articles