“ది గర్ల్ ఫ్రెండ్” చిత్ర రివ్యూ

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తూ విద్యా కుప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ జంటగా నటిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రానికి హేశం అబ్దుల్ వహాబ్ పాటలకు సంగీతాన్ని అందించగా ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. కృష్ణన్ వసంత్ సినిమా చోట కె ప్రసాద్ సినిమాకు ఎడిటింగ్ వర్క్ చేశారు. అను ఇమ్మానుయేల్, రాహుల్ రవీంద్రన్, రావు రమేష్, రోహిణి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలో పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే….

కథ :

తల్లి లేని కూతురు కదా అని ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న ఒక అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. అయితే తను సాధారణంగా బయట అందరిలా ఉండటం మా అతనికి ఇష్టం ఉండదు. జలసీతో గర్ల్ ఫ్రెండ్ ఎవరితో ఉండకూడదు అని టాక్సిక్ నేచర్తో ఉంటాడు. అటువంటి బాయ్ ఫ్రెండ్ తో ఆ అమ్మాయి ఎటువంటి చాలెంజ్ లు ఫేస్ చేసింది? చివరికి అతనితో పెళ్లి అవుతుందా లేదా? వారి రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది? వారి రిలేషన్షిప్ ప్రయాణంలో వారి జీవితాల్లో వచ్చే మార్పులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే చూడాల్సిందే.

నటీనటున నటన :

చిత్రంలో భూమ పాత్రలో రష్మిక మందన్న అద్భుతంగా నటించారు. తన నటన శైలిలో ప్రేక్షకులను ప్రతి విషయంలో మెప్పించారు. నటన దగ్గర నుండి ప్రతి సందర్భంలో ఎక్స్ప్రెషన్ వరకు అన్ని అంశాలలో తన నటనతో అద్భుతంగా నటించారు. విక్రమ్ పాత్రలో దీక్షిత్ ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ పాత్రలో కాస్త కోపంగా బాగా నటించారు. అను ఇమ్మానుయేల్ తన పాత్ర పరిధిలో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. రావు రమేష్ రష్మిక తండ్రి పాత్రలో బాగా నటించారు. తెరపై తక్కువ సమయం కనిపించినప్పటికీ చిత్రంలో మంచి ఇంపాక్ట్ సృష్టించారు. రోహిణి పాత్ర సినిమా పై మంచి ఎఫెక్ట్ ఇచ్చింది. చిత్రంలోని ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :

రాహుల్ రవీంద్రన్ తాను రాసుకున్న కథను తెరపై చూపించడంలో విజయం సాధించారు. ప్రస్తుతం బయట చూస్తున్న ప్రేమికుల మధ్య ఉన్న సిచువేషన్స్ ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు అర్థమవుతుంది. అయితే ఈ సినిమా ఎంతోమంది అబ్బాయిలకు, అమ్మాయిలకు కనెక్ట్ అవడం మరొక విజయం. సినిమాలోని పాటలు సినిమాకి బోనస్గా నిలిచాయి. అలాగే చిత్రంలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఎమోషన్స్ తో కూడిన చిత్రం కాబట్టి కాస్త నిదానంగా అనిపించినప్పటికీ చాలా అద్భుతంగా వచ్చింది. నిర్మాణం లోని బాగున్నాయి. లొకేషన్స్ ఎక్కువగా కాలేజీలో ఇంకా ఇతర న్యాచురల్ లోకేషన్ తో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాలని.

ప్లస్ పాయింట్స్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటీనటుల నటన, పాటలు, బిజిఎం.

మైనస్ పాయింట్స్ :

సినిమా నిదానంగా ఉండటం.

సారాంశం :

ప్రస్తుత పరిస్థితులను దగ్గరగా చూపిస్తూ ప్రేమ వంటి రిలేషన్స్ లో హద్దులు అలాగే స్వాతంత్రం ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి అనేది తెలియజేస్తూ ఒక చక్కటి ఆలోచనతో కుటుంబ సమేతంగా చూడదగ్గర చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.

Related Articles

Latest Articles