
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంత, గోపీచంద్ అచంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు టీజర్లు భారీ స్పందన రాబట్టాయి.
ఇప్పుడు మేకర్స్ మొదటి సింగిల్ ‘ది తాండవం’ ప్రోమోను విడుదల చేశారు. ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎస్. తమన్ స్వరసారథ్యంలో రూపొందిన ఈ ట్రాక్‌లో బాలకృష్ణ అఘోరా అవతారంలో శివ తాండవం చేస్తూ కనిపిస్తున్నారు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ వాయిస్‌లు, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోశాయి. నవంబర్ 14న లిరికల్ వీడియో విడుదల కానుంది. చిత్రంలో సమ్యుక్త హీరోయిన్గా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో, హర్షలి మల్హోత్రా భావోద్వేగాత్మక రోల్లో నటిస్తున్నారు.


