నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన ఆమె, తనకు నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

“నాగార్జున బాధపడి ఉంటే నేను చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను” అంటూ కొండా సురేఖ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి ఈ నిర్ణయం నాగార్జున అభిమానుల్లో సానుకూల స్పందనలు రాబట్టింది.

Related Articles

Latest Articles