నిర్దోషిణి అని కోర్టు తీర్పు – నటి హేమ ఎమోషనల్ అనౌన్స్‌మెంట్

ప్రముఖ నటి హేమ తనపై ఉన్న కేసును బెంగళూరు హైకోర్టు క్వాష్ చేసి, తాను నిర్దోషిణి అని తీర్పు ఇచ్చింది. నవంబర్ 3న వచ్చిన జడ్జిమెంట్ కాపీ ఇప్పుడు చేతికి అందినందున, ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు.

సోషల్ మీడియాలో తనపై జరిగిన దుష్ప్రచారం వల్ల తీవ్ర మనోవేదనకు గురైనట్టు హేమ వెల్లడించారు. ఈ బాధతో తన తల్లి చనిపోయారని, గత సంవత్సరంగా నరకయాతన అనుభవిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏమీ చేయలేదని చెప్పినా, కొందరు అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని హేమ తెలిపారు.

Related Articles

Latest Articles