చిత్రపురి కాలనీ అక్రమాలపై విచారణ పూర్తి – 15 మంది బాధ్యులు

చిత్రపురి కాలనీలో 2005 నుంచి 2020 వరకు జరిగిన అక్రమాలు, అవకతవకలపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో, నవంబర్ 27న తెలంగాణ ప్రభుత్వానికి ఫైనల్ నివేదిక సమర్పించారు. అక్రమాలకు పాత మరియు ప్రస్తుత కమిటీ సభ్యులు సహా 15 మందిని బాధ్యులుగా గుర్తించినట్టు నివేదికలో పేర్కొన్నారు.

కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై కీలక అంశాలు వెలుగుచూశాయి. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానందం, వల్లభనేని అనిల్ తదితరుల పేర్లు ప్రస్తావించారు. ఈ అక్రమాల ద్వారా రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని, అదనంగా 18 శాతం వడ్డీ చెల్లించాలని నివేదికలో సూచించారు. డిప్యూటీ రిజిస్ట్రార్ ఈ నివేదిక కాపీలను 15 మందికి పంపించారు. ఈ కేసు సినీ పరిశ్రమలో మరిన్ని చర్చలకు దారితీసే అవకాశం ఉంది.

Related Articles

Latest Articles