
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “అన్నగారు వస్తారు” ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. .
ఈ రోజు “అన్నగారు వస్తారు” చిత్రం నుంచి ‘అలాపిక్కే ఉమ్మక్’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను సంతోష్ నారాయణన్ ట్రెండీ ట్యూన్ తో కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించి పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘వలయ అహ్ కలయ, గోలయ్య, జై బాలయ్య, కలలే వలరా, గురువా నా మాటే వినరా..’ అంటూ కార్తి ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఆకట్టుకుంటోందీ పాట. రీసెంట్ గా పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ రిలీజ్ చేసిన “అన్నగారు వస్తారు” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదే రెస్పాన్స్ థియేటర్స్ లోనూ వస్తుందనే భారీ అంచనాలు ఈ సినిమా మీద ఏర్పడుతున్నాయి.
నటీనటులు – కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్
మ్యూజిక్ – సంతోష్ నారాయణన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి


