కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ‘మొగ్లీ 2025’

రోషన్ కనకాల హీరోగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ’ తొలి వారంలోనే బ్రేక్‌ఈవెన్‌ను దాటి లాభాల బాటలోకి అడుగుపెట్టింది. సెన్సిబుల్ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, రెండో వారంలోకి వచ్చేసరికి మంచి లాభాలను ఆర్జిస్తోంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ వసూళ్లతో కలిపి దాదాపు 10 కోట్ల రూపాయలు సాధించి, నిర్మాతలకు మంచి ప్రాఫిట్ తెచ్చిపెట్టింది.

కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ విజయం సాధించగలవని ‘మోగ్లీ’ నిరూపించింది. రోషన్ కనకాల యాక్షన్, ఎమోషన్స్‌లో అద్భుతంగా నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. హీరోగా ఇది అతని తొలి ఘన విజయం. విలన్‌గా బండి సరోజ్ కుమార్ పెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

డైరెక్టర్ సందీప్ రాజ్ 8 కోట్ల బడ్జెట్‌లో టాప్ క్వాలిటీతో సినిమాను పూర్తి చేశాడు. TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం, చిన్న-మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కాలంలో ఇండస్ట్రీకి మంచి ఉత్సాహాన్ని అందించింది.

Related Articles

Latest Articles