“ఈషా” చిత్ర రివ్యూ

త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా హెబ్బా పటేల్, సిరి హనుమంత్ హీరోయిన్లుగా నటిస్తూ హెచ్.వి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఈషా. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, వంశీ నందిపాటి బ్యానర్స్ పై విడుదలవుతున్న ఈ చిత్రంలో బబ్లు, పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆర్ఆర్ ధృవన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల ఈ చిత్ర మరియు విషయానికి వస్తే…

కథ :
మూఢనమ్మకాలను, దెయ్యాలను, ఆత్మలను నమ్మని నలుగురు మిత్రులు కలిసి అటువంటి నమ్మకాలను ఉపయోగించుకుని ప్రజలను మోసం చేస్తున్న కొంతమంది దొంగ బాబాలు స్వామీజీల గుట్టు రట్టు చేసే ప్రయాణంలో ఈ కథ మొదలవుతుంది. అయితే అలా మొదలైన వీరి ప్రయాణం ఎటువైపు వెళుతుంది? వీరి జీవితంలోకి పృథ్వీరాజ్ ఎందుకు వస్తారు? అతని వల్ల వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి? చివరికి వీరు ఈ నమ్మకాలు అన్నీ నిజమంటారా లేదా అబద్ధమంటారా? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితలపై ఈషా చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఇప్పటికే ఎన్నో చిత్రాలలో వివిధ పాత్రలో కనిపించిన ఈ చిత్రంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకర్షించారు. అలాగే హెబ్బా పటేల్ కూడా గతంలో కొన్ని హారర్ సినిమాలలో చేసినప్పటికీ ఈ చిత్రంలో పాత్ర కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. సిరి హనుమంత్ పాత్ర ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఆమె భయపడుతూ చేసిన నటన ప్రేక్షకులలో సినిమా చూసేప్పుడు మరింత భయాన్ని పెంచుతుంది. ఇటీవలే రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ ఈ చిత్రంలో మరొక హీరోగా నటించారు. అతని పాత్ర కూడా గత సినిమాతో పోలిస్తే ఈ సినిమాతో పూర్తిగా భిన్నంగా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. పృథ్వీరాజ్ నటన సినిమాలో హైలెట్గా నిలిచింది. అలాగే మిగతా నటీనటుల పాత్రలు చిత్రంలో తక్కువ అయినప్పటికీ వారి పాత్రలు సినిమాకు కాలాన్ని చేకూర్చాయి.

సాంకేతిక విశ్లేషణ :
తాను అనుకున్న కథను భయాందోళనలతో వెండితెరపై ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయడం అనేది ఇటువంటి జోనర్లో ఎంతో కష్టమైన విషయం కానీ దర్శకుడు శ్రీనివాస మన్నే ఆ విషయంలో విజయం సాధించారు. కొన్ని సీన్లలో బిజీఎంతో భయపెడుతూ ప్రేక్షకులు ఉలిక్కిపడేంతలో సినిమా భయపడుతుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ ఇంకా మేకప్ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అంతగా లేనప్పటికీ సినిమాలోని భయాలను చూస్తూ వాటిని ప్రేక్షకులు పట్టించుకునేలా లేవు. లొకేషన్స్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
దర్శకత్వం, బిజిఎం, హానర్ ఎలిమెంట్స్

మైనస్ పాయింట్స్ :
కథ, కొన్ని సన్నివేశాలు

సారాంశం :
హారర్ చిత్రాలను వీక్షించే ప్రేక్షకులు కచ్చితంగా భయపడేలా పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తూ ఎక్కడ ఇబ్బంది పడకుండా కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ఈషా.

Related Articles

Latest Articles