ఆర్టీఐ కమిషనర్ వీఎస్కే చక్రవర్తి

రాష్ట్రసమాచార కమిషనర్గా సీని యర్ పాత్రికేయుడు వీఎస్కే చక్రవర్తి ఎంపికయ్యారు. ఆయ నకు 21 సంవత్సరాలు పాత్రికే యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యమంత్రి చంద్ర బాబు అధ్యక్షతన ఇటీవల జరిగిన కమిటీ సమావే శంలో చక్రవర్తిని ఈ పదవికి ఎంపిక చేశారు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఉత్తమ సినీ విమర్శకుడిగా గతంలో నంది అవార్డు అందుకున్నారు.

Related Articles

Latest Articles