రవితేజ ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ నుంచి మూడో సాంగ్ విడుదల

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ నుంచి మూడో సాంగ్ ‘వామ్మో వాయ్యో’ విడుదలైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సెసిరోలియో స్వరసారథ్యంలో వచ్చిన ఈ ఫోక్ యాంథమ్‌లో స్వాతి రెడ్డి UK గాత్రం, దేవ్ పవార్ సాహిత్యం, శేఖర్ VJ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి.

రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో రెచ్చిపోగా, హీరోయిన్లు అషికా, డింపుల్ గ్లామర్‌తో మెరిసి, ముగ్గురూ కలిసి డ్యాన్స్ ఫ్లోర్‌ను హీట్ చేశారు. కలర్‌ఫుల్ సెట్స్, రస్టిక్ ఫ్లేవర్‌తో ఈ సాంగ్ ఆల్బమ్‌లో బెస్ట్‌గా నిలుస్తుంది.ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, AS ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో సునీల్ కూడా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది.

Related Articles

Latest Articles