
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో పార్లమెంట్ అగ్రికల్చర్ కమిటీ., సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సినీ నటి సురేఖ వాణి, సుప్రిత., ప్రొడ్యూసర్ లోహిత్., కేవీఎన్ ప్రొడక్షన్ అధినేత వెంకట్ నారాయణలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.


