
యంగ్ హీరో హవిష్, మాస్ ఎంటర్‌టైనర్‌లకు పేరొందిన డైరెక్టర్ త్రినాధరావు నక్కినతో కలిసి ‘నేను రెడీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘నువ్విలా’, ‘జీనియస్’, ‘రామ్ లీలా’, ‘సెవెన్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన హవిష్, ఇందులో క్విర్కీ, ఆటిట్యూడ్, ఎమోషనల్ డెప్త్ కలిగిన పాత్రలో కనిపించనున్నారు. ‘సినిమా చూపిస్తా మామా’, ‘నేను లోకల్’, ‘ధమాకా’, ‘మజాకా’ లాంటి హిట్లు ఇచ్చిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిఖిలా కోనేరు హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కావ్యా తాపర్ నటిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో ప్రత్యేకంగా విడుదల కానుంది. సంక్రాంతి బిగ్గీతో కలిసి లాంచ్ కావడంతో విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది. డిజిటల్ లాంచ్ కూడా త్వరలోనే. టీజర్ పోస్టర్‌లో హవిష్ టఫ్, ఇంటెన్స్ లుక్‌లో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు.
బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, విక్రాంత్ శ్రీనివాస్ స్టోరీ-డైలాగ్స్, రామకృష్ణ యాక్షన్‌తో టెక్నికల్ టీమ్ బలంగా ఉంది. ప్రస్తుతం ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుగుతున్నాయి.


