
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న హైలీ ఎంటిసిపేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’లో మ్యూజికల్ ప్రమోషన్స్ బాంబాటిక్గా మొదలయ్యాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ గ్లోబల్ రికార్డులు సృష్టించి, ఐదు భాషల్లో 200 మిలియన్+ వ్యూస్‌ను సాధించింది.
ఏఆర్ రెహమాన్ స్వరసారథ్యంలో రూపొందిన ఈ పాట, దాని ఎనర్జిటిక్ రిథమ్, రా ఎనర్జీ, సెలబ్రేటరీ వైబ్‌తో పాటు రామ్ చరణ్ స్వాగ్ మరియు డ్యాన్స్ గ్రేస్‌తో మాసివ్ రిపీట్ వాల్యూ సంపాదించింది. 2 మిలియన్+ లైక్‌లు, 60 మిలియన్+ ఆడియో స్ట్రీమ్‌లతో చార్ట్‌లలో డామినేట్ చేస్తూ, సంగీత ప్రేమికులు మరియు సినీ అభిమానుల డైలీ ప్లేలిస్ట్‌లో స్థానం సంపాదించింది.
సోషల్ మీడియాలో వైరల్ స్టార్మ్ సృష్టించిన ఈ పాటకు 300కే+ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు 870కే+ యూట్యూబ్ షార్ట్స్ రూపంలో నెటిజన్లు ఐకానిక్ హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ యువతలో గ్లోబల్ మూవ్‌మెంట్‌ను సృష్టించారు.
వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ మార్చి 27న పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.


